AAP vs Congress: కూటమిలో కలహం.. కమలం హ్యాపీ!
ఇద్దరు కొట్టుకుంటే మూడో వ్యక్తికి లాభం అన్నట్లు.. కూటమి కూటమి అని చెప్పి చివరికి అదే కూటమిలో కుంపటి పెట్టుకున్నట్లైంది (aap vs congress) . రానున్న లోక్ సభ ఎన్నికల్లో BJPని ఓడించాలని కాంగ్రెస్ (congress) గట్టిగా నిర్ణయించుకుంది. ఇందుకోసం 26 అపోజిషన్ పార్టీలను ఒక తాటిపైకి ఇచ్చి దానికి ఇండియా (INDIA) అని పేరు పెట్టింది. కాంగ్రెస్‌తో చేతులు కలిపిన పార్టీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి (aap).
ఇప్పుడు సమస్య ఏంటి?
అయితే అపోజిషన్ పార్టీలన్నీ కలిసి బీజేపీపై దండెత్తుతాయని అనుకుంటే.. వారిలో వారే కొట్టుకుంటున్నారు. ఆప్ కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అనేంతగా మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఈరోజు చత్తీస్‌గఢ్‌లో పర్యటించిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) అక్కడ ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి అద్వానంగా ఉందని ఆరోపించారు. ప్రస్తుతం చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారంలోఉంది. అరవింద్ మాటలు నచ్చని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా (pawan khera) ముందు ఢిల్లీలోని స్కూళ్ల పరిస్థితి చూసుకోండి అని సెటైర్ వేసారు. (aap vs congress)
కేజ్రీవాల్ ఏమన్నారు?
చత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “” ఛత్తీస్‌గఢ్‌లోని ప్రభుత్వ పాఠశాలలు మరీ అద్వానంగా ఉన్నాయి. దాంతో చాలా పాఠశాలలు మూసేసారని తెలిసింది. పది తరగతుల వరకు ఒక్కరే టీచర్ ఉండేవారట. చాలా మంది టీచర్లకు సాలరీలు కూడా రావడంలేదట. ఢిల్లీలోని పాఠశాలల పనితీరు చూడండి. లేదంటే మీ బంధువులను కొన్ని రోజులు ఢిల్లీలో ఉండమని చెప్పండి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక విద్యా రంగాన్ని ఎంతో అభివృద్ధి చేసిన ఏకైక రాష్ట్రం ఢిల్లీ. మేం రాజకీయనాయకులం కాదు మీలాగే సాధారణ ప్రజలం “” అని అన్నారు.
పవన్ ఖేరా స్పందన
కేజ్రీవాల్ కూటమిలో భాగమై సపోర్ట్ అంతకుముందు ప్రభుత్వాన్ని విమర్శించాల్సిందిపోయి కాంగ్రెస్‌నే వేలెత్తి చూపుతున్నారని పవన్ మండిపడ్డారు. “” ఈ మాత్రం దానికి కేజ్రీవాల్ రాయ్‌పూర్ వెళ్లాల్సిన అవసరం లేదు. ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న మా ప్రభుత్వం అంతకు ముందు ఉన్న ప్రభుత్వం చేసిన పనులతో పోల్చకుంటుంది. మీరు మీకు నచ్చిన రంగాన్ని ఎంచుకోండి. ఆ రంగానికి చెందిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఎలా చేస్తోంది? ఆప్ పార్టీ చత్తీస్‌గఢ్‌లో ఎలా చేస్తోందో డిబేట్ పెట్టుకుందాం. రెడీనా? “” అని సవాల్ విసిరారు. (aap vs congress)
BJP హ్యాపీ
ఇలా ఒకే కూటమిలో ఉన్న రెండు పార్టీలు కొట్టుకుంటుంటే BJPకి చాలా హ్యాపీగా ఉంటుంది. రానున్న ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి BJPకి ఇది మంచి పాయింట్ అవుతుంది. కూటమిలో లేని ఐకమత్యం గెలిచాక మాత్రం ఏముంటుంది అన్నట్లు ప్రజలకు బ్రెయిన్ వాష్ చేస్తుంది.