Rishi Sunak: ఇజ్రాయెల్‌లో ల్యాండ్ అయిన బ్రిటన్ ప్రధాని
Rishi Sunak in Israel: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (rishi sunak) ఇజ్రాయెల్‌లో (israel) ల్యాండ్ అయ్యారు. కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం (israel gaza war) జరుగుతున్న సంగతి తెలిసిందే. మొన్న రాత్రి గాజాలోని బాప్టిస్ట్ హాస్పిటల్‌పై జరిగిన రాకెట్ దాడిలో దాదాపు 500 మంది మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం మరింత ముదరకుండా సునాక్ కొన్ని నిర్ణయాలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహుతో (benjamin netanyahu) చర్చించనున్నారు. నిన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (joe biden) ఇజ్రాయెల్‌కు వెళ్లి నెతన్యాహుకి బాసటగా నిలిచిన సంగతి తెలిసిందే.