RGV: అన్ని స‌ర్వేల‌ల్లో ఇత‌ని స‌ర్వే ఖ‌చ్చిత‌మైన‌ది

rgv says exit poll survey by sira sri is the accurate one

RGV: శ‌నివారం ఎగ్జిట్ పోల్స్ స‌ర్వేలు వెలువ‌డ్డాయి. ఊరు పేరు లేని చిన్న చిన్న స‌ర్వేల నుంచి టాప్ స‌ర్వేల వ‌ర‌కు అంద‌రూ ఎగ్జిట్ పోల్స్ బ‌య‌టపెట్టారు. అయితే శ‌నివారం ఎన్నో ఎగ్జిట్ పోల్స్ వెలువ‌డిన‌ప్ప‌టికీ.. అత్యంత ఖచ్చిత‌మైన సర్వే ఇచ్చింది మాత్రం ఒకే ఒక్కరు అని అన్నారు ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఆ ఒక్క‌రు ఎవ‌రో తెలుసా? ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత సిరాశ్రీ.

గేయ ర‌చ‌యిత‌కు ఎగ్జిట్ పోల్స్‌కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? మ‌రి ఆయ‌న ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ నిజంగానే ఖ‌చ్చిత‌త్వాన్ని సూచిస్తున్నాయి. సిరాశ్రీ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు ఎలా ఉన్నాయంటే..

ఏపీ అసెంబ్లీ
YCP: 0 నుంచి 175
కూట‌మి: 0 నుంచి 175

ఏపీ లోక్‌స‌భ‌
YCP: 0 నుంచి 25
కూట‌మి: 0 నుంచి 25

ఇవి త‌న ఎగ్జిట్ పోల్స్ అని.. ఏ స‌ర్వే ఎగ్జిట్ పోల్స్ అయినా త‌ప్ప‌చ్చు కానీ తాను చేసిన స‌ర్వే మాత్రం త‌ప్పే అవ‌కాశ‌మే లేద‌ని సిరాశ్రీ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్‌కి రామ్ గోపాల్ వ‌ర్మ స్పందిస్తూ.. అత్యంత ఖచ్చిత‌మైన ఎగ్జిట్ పోల్ స‌ర్వే ఇత‌నిదే అని చ‌మ‌త్క‌రించారు. వ‌ర్మ తీసిన సినిమాల్లో ప‌లు సినిమాల‌కు సిరాశ్రీ గేయ ర‌చ‌యిత‌గా ప‌నిచేసారు.