Sumathi Reddy: “నా త‌మ్ముడు మంచి సీఎం అనిపించుకుంటాడు”

రేవంత్ రెడ్డి (revanth reddy) తెలంగాణ ముఖ్య‌మంత్రి అయిన నేప‌థ్యంలో ఆయ‌న అక్క సుమ‌తి రెడ్డి (sumathi reddy) స్పందించారు. త‌న త‌మ్ముడికి చిన్న‌ప్ప‌టి నుంచి రాజ‌కీయాలంటే ఇష్ట‌మ‌ని ఆ ఇష్టంతోనే ABVPలో చేరి ఈరోజు రాష్ట్ర సీఎం ప‌ద‌వి ద‌క్కించుకునే దాకా వ‌చ్చాడ‌ని త‌న త‌మ్ముడు త‌ప్ప‌కుండా రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తాడ‌ని తెలిపారు. మంచి సీఎం అనిపించుకుంటాడ‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని పేర్కొన్నారు.