Revanth Reddy: TDPకి KCR 2021లో రిజైన్ చేసారు
Hyderabad: TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy) మరోసారి ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ సీఎం KCRపై తీవ్రంగా ఆరోపణలు చేసారు. 2001 ఏప్రిల్ 27 నాడు KCR TRS పార్టీ పెట్టారని 2021 ఏప్రిల్ 21 నాడు ఆయన TDP పార్టీకి రాజీనామా చేసారంటూ పొంతనలేని కామెంట్స్ చేసారు. మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి మీద కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
KCR, హరీష్ రావులకు (harish rao) వయసు, ఒళ్లు పెరిగాయి కానీ బుద్ధి మాత్రం రాలేదని అన్నారు. స్పీకర్, కౌన్సిల్ ఛైర్మన్ అనేవారు ప్రతిపక్ష నాయకుల గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి (pocharam srinivas reddy) ఇద్దరు కొడుకులు లోకంలో ఉన్న లోఫర్ పనులన్నీ వారే చేస్తున్నారని విమర్శించారు. ఆ కేసులను కప్పి పుచ్చుకోవడానికి కౌన్సిల్ ఛైర్మన్‌గా ఉండి KCR బూట్లు నాకుతున్నావు అంటూ మండిపడ్డారు. ఇక సుఖేందర్ రెడ్డి (sukendar reddy) మంత్రి కావాలనుకున్నారని, ఓ పాడైపోయిన ఇంజిన్‌గా ఉన్న ఆయన్ని గతంలో రెండు సార్లు పైసా ఖర్చు లేకుండా కాంగ్రెస్ పార్టీ (congress) అవకాశం ఇచ్చిందని అన్నారు. ఆ విశ్వాసం కూడా లేదా, నమ్మక ద్రోహి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.