Revanth Reddy: KCR చెప్పింది క‌రెక్టే..!

కాంగ్రెస్ నేత‌, TPCC అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy) కొడంగ‌ల్ జిల్లాలో మ‌రోసారి తెలంగాణ ప్రభుత్వంపై ధ్వ‌జ‌మెత్తారు. గ‌తంలో తెలంగాణ సీఎం KCR, KTR కొడంగ‌ల్‌ను ద‌త్త‌త తీసుకున్నార‌ని.. అప్ప‌టివ‌ర‌కు కాంగ్రెస్ చేసిన‌ది ఏమీ లేదు మేం చేస్తామంటూ వాగ్దానాలు చేసి చివ‌రికి అనాథ‌లా వ‌దిలేసారి ఆరోప‌ణ‌లు చేసారు. మైక్ ప‌ట్టుకుంటే KCR, KTR తెలంగాణ దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ రాష్ట్రం అంటుంటార‌ని.. ఆయ‌న చెప్పింది క‌రెక్టే కానీ.. ఆ నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని మ‌ద్యం దుకాణాలు తెర‌వ‌డంలో తాగుబోతుల‌ను త‌యారుచేయ‌డంలో సాధించార‌ని విమ‌ర్శించారు.

తెలంగాణ‌లోని కోకాపేట‌లో ఎక‌రం రూ.100 కోట్లు ఉంద‌ని చెప్పిన‌ప్పుడు ఆ ఎక‌రం కొన్న‌ది కూడా BRS నేత‌లేన‌ని.. వాళ్లు వేల కోట్లు కాజేసి ఈరోజు సామాన్యుడు గ‌జం కొనుక్కోలేని ప‌రిస్థితిని తీసుకొచ్చార‌ని అన్నారు. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత గురునాథ్ రెడ్డి (gurunath reddy) సూచ‌న మేర‌కు ఈసారి కొడంగ‌ళ్ నుంచి పోటీ చేయాల‌ని అనుకుంటున్నామ‌ని.. అధికారంలోకి వ‌చ్చాక తెలంగాణ‌లోనే అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా కొడంగ‌ళ్‌ను మారుస్తాన‌ని అన్నారు. (revanth reddy)