Revanth Reddy: రెండు నెలలు ఓపిక పట్టండి
రెండు నెలలు ఓపిక పట్టండి.. విద్యార్థులకు, నిరుద్యోగులకు మంచి భవిష్యత్తుని మేం అందిస్తాం అని హామీ ఇస్తున్నారు TPCC అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి (revanth reddy). నిన్న చిక్కడపల్లిలోని అశోక్ నగర్‌లోని ఓ హాస్టల్‌లో ప్రవళిక (pravallika suicide) అనే 22 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకున్న అంశం గురించి రేవంత్ మాట్లాడారు. ఆ అమ్మాయి గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడటంతో ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు తన ముఖం చూపించలేక తన బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలీక ఆత్మహత్య చేసుకుంటే.. ఆమె లవ్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయిందని తప్పుడు కేసు బనాయిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. నిన్న ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే అప్పుడే కేసును ఎలా ఛేదించారని ప్రశ్నించారు. ఇంకో రెండు నెలల్లో తెలంగాణలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అప్పటి వరకు విద్యార్థులు ఆత్మహత్యలు వంటి ఆలోచనలు కూడా చేయొద్దని అన్నారు.