Revanth Reddy: ది గేమ్ ఛేంజర్..!
Revanth Reddy: నువ్వు ఎలా గెలుస్తావో చూస్తా.. అని కొందరు.. నిన్ను ఓడించడానికైనా కాళ్లకు గజ్జెలు కట్టుకుని మరీ ప్రచారం చేస్తా అని మరికొందరు.. ఇలా చాలా మంది రేవంత్ రెడ్డిపై వ్యతిరేకంగా ఉన్నవారే. పైగా సొంత పార్టీ నేతల నుంచే రేవంత్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. కానీ ఇవేవీ రేవంత్‌ను ఓడించలేకపోయాయి. చివరికి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించిన గేమ్ ఛేంజర్‌గా మారారు రేవంత్. కాంగ్రెస్ పార్టీలో చేరి ఆరేళ్లే అవుతున్నా సీనియర్ నేతలు లేని పట్టు రేవంత్ సాధించారు.
ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌పై కామారెడ్డిలో పోటీ చేసిన రేవంత్.. అక్కడ ముందంజలో నిలవడమే కాదు.. తన నియోజకవర్గం అయిన కొడంగళ్లోనూ గెలిచి చూపించారు. ఇది చాలదా రేవంత్ సత్తా ఏంటో నిరూపించడానికి. యావత్ తెలంగాణకే రేవంత్ స్టార్ క్యాంపెయినర్ అయ్యారు. నోటి కొచ్చినట్లు తిడుతూ ధూషిస్తున్నప్పటికీ ప్రజలు అవేమీ పట్టించుకోలేదు. రెండు నియోజకవర్గాల్లో ఆయన్నే గెలిపించారు. ఇప్పుడు రేవంత్ పాపులారిటీ రెట్టింపు అయ్యింది. సో.. తెలంగాణ సీఎం పదవికి రేవంత్‌కి ఇచ్చే అవకాశాలు 90% కనిపిస్తోంది.