EXCLUSIVE: సొంత క్యాబినెట్ మంత్రినే తొక్కేస్తున్నారా?
EXCLUSIVE: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. (revanth reddy) ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును (sridhar babu) తొక్కేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. ఐటీ ఇండస్ట్రీస్ శాఖలో పెట్టుబడులు తీసుకొస్తే పబ్లిసిటీ వస్తుందని ఆ శాఖ మంత్రి అయిన శ్రీధర్ బాబును సైడ్ చేసి క్రెడిట్ కొట్టేయాలని రేవంత్ చూస్తున్నట్లు తెలుస్తోంది. లేకపోతే ఐటీ మంత్రి లేకుండా పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వారితో సీఎం మంతనాలు ఏంటి అని అంతర్గత చర్చలు కూడా మొదలయ్యాయి.