అమ్మకానికి 2,620 ఎకరాల హౌసింగ్ బోర్డు భూములు..!

ఇందిరమ్మ ఇళ్లు, ఇత‌ర గ్యారంటీల వంటి సంక్షేమ పథకాలు అమలు చేయడానికి భారీగా నిధుల సమీకరణ కోసం 2,620 ఎకరాల భూములు అమ్మేయాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన‌ట్లు తెలుస్తోంది. డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ పరిధిలో ఉన్న 1,800 ఎకరాలు, హౌసింగ్ బోర్డు పరిధిలో ఉన్న 820 ఎకరాల భూములు ఉండగా ఇవి కబ్జాలకు గురవుతున్నాయి. కాపాడలేము అనే సాకు చెప్పి వేలం వేయాలని సీఎం రేవంత్ రెడ్డి (revanth reddy) నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.