Revanth Reddy: ఆ మాట చంద్రబాబు అన్నప్పుడు ఎందుకు రియాక్ట్ కాలే?
Hyderabad: రైతులకు 3 గంటల కరెంట్ సరిపోతుంది వారికి ఉచిత కరెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని కాంట్రోవర్సీకి తెరలేపిన TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy) ఇప్పుడు కవరింగ్ కోసం ప్రెస్ మీట్ పెట్టారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉచిత కరెంట్ ఇస్తామని అంటే.. ఎందుకు తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికా అని చంద్రబాబు నాయుడు అన్నారు. మరి అప్పుడు ఎందుకు ఇప్పుడు చేస్తున్నంత రాద్దాంతం చేస్తున్నారు అని రేవంత్ ప్రశ్నించారు. ఆనాడు చంద్రబాబు నాయుడు (chandrababu naidu) సీఎంగా ఉన్నప్పుడు బషీర్ బాగ్ ఘటనలో రైతులను పిట్టలను కాల్చినట్లు కాల్చితే ఆ ప్రభుత్వంలో ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి KCR భాగస్వామిగా ఉన్నారు అని ఆరోపించారు. KCR ఒక నీచుడంటూ BRSపై తీవ్ర ఆరోపణలు చేసారు.
“KTR తెలంగాణ కోసం విదేశీ పెట్టుబడులు పెట్టిస్తున్నారు అంటున్నారు. అది నిజం కాదు. ఇక్కడి డబ్బులు తీసుకెళ్లి విదేశాల్లో పెడుతున్నారు. నేను దీని గురించి తెలసుకోవడానికే మొన్న అమెరికా వెళ్లాను. అందుకే భయపడి ఇప్పుడు నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడ టెండర్ ఉంటే అక్కడికి వెళ్లిపోతాడు. ధరణి పోర్టల్ నుంచి లిస్ట్ బయటికి తీస్తే అమెరికాలో ఇన్‌వెస్ట్ చేస్తున్నవారి పేర్లే ఉన్నాయి. నేను ఈ సమాచారం సేకరించడానికే తానా వెళ్లాను. ఇప్పుడేదో నేను కరెంట్ గురించి రెండు మాటలు అంటే మేం 24 గంటలు ఇస్తున్నాం అంటూ KTR చెప్తున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ సబ్ స్టేషన్‌కు వెళ్లి రికార్డులు పరిశీలిస్తే 11 గంటల కంటే ఎక్కువ సేపు కరెంట్ ఇవ్వడంలేదని తెలిసింది. ఈ సర్కార్ మాకు నగ్నంగా దొరికేసింది. KTR, KCR సన్నాసులు. ఈ విషయాన్ని కేటీఆర్ కొడుకు హిమాన్ష్ రావు కూడా ఒప్పుకున్నాడు” అన్నారు.