ఎన్నికలు దగ్గరపడుతున్నాయని KCR మావోలపై నిందమోపుతున్నారు
Telangana Elections: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని (kaleswaram project) మేడిగడ్డ బ్రిడ్జ్ (medigadda) కుంగిన సంగతి తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజ్ పునాదుల వల్ల ఇసుక మైగ్రేట్ అవ్వడంవల్లే అది కుంగిందని దానిని నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థ నిపుణులు చెప్తున్నారు. దీనిపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి (revanth reddy) స్పందిస్తూ.. మట్టి కుంగిందని తెలిసినప్పుడు వెంటనే దానిని నిర్మించిన ఆర్కిటెక్ట్‌లను పిలిపించి వారిపై కేసులు వేయాలని.. ఈ మేడిగడ్డ బ్యారేజ్, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగించారు కాబట్టి ఎందుకు తెలంగాణ ప్రభుత్వం దానిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టలేదని రేవంత్ ప్రశ్నించారు.
మళ్లీ వారినే పిలిపించి విచారణ చేపట్టినప్పుడు ఆ నివేదికను ఎందుకు విడుదల చేయలేదని అన్నారు. మేడిగడ్డ బ్రిడ్జ్ కుంగడం వెనుక మావోయిస్టులు ఉన్నారని వారు మందు పాత్రర్లు పెట్టి పేల్చారని అంటున్నారని ఎన్నికలు దగ్గరపడుతున్నాయి కాబట్టి నింద మావోలపై వేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.