Revanth Reddy: మేం హెలికాప్టర్ తెప్పిస్తాం.. KTR, హరీష్‌రావు వస్తారా?
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని (kaleswaram project) మేడిగడ్డ (medigadda) బ్యారేజ్ వంతెన కుంగిన ఘటనపై అవాక్కులు చవాక్కులు పేల్చారు కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి (revanth reddy). కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి అంత గొప్పగా చెప్పిన ముఖ్యమంత్రి KCR ఈరోజు ఎందుకు మేడిగడ్డ వంతెనపై స్పందించలేదని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విజిలెన్స్ కమిటీ వేయించి సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు. కావాలంటే తాము హెలికాప్టర్ని ఏర్పాటుచేస్తామని.. తమతో పాటు KTR, హరీష్ రావులు (harish rao) వస్తారా అని నిలదీసారు. అంతా కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్దామని అంతా బాగుంటే క్రిడిట్ వారికేనని అన్నారు.
ఇదే విషయం గురించి రాహుల్ గాంధీ మాట్లాడితే కుటుంబ రాజకీయాలు అని వేలెత్తి చూపుతున్నారని.. కానీ ఏనాడూ కూడా జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలు రాజకీయాల్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులకు అవకాశాలు ఇవ్వలేదని.. వారి తర్వాతే రాహుల్, ప్రియాంక రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. కానీ KCR.. అధికారం రాగానే తన పిల్లలను అమెరికా నుంచి పిలిపించి, కుటుంబ సభ్యులకు అన్నింటిలో సీట్లు ఇచ్చేసారని.. కవిత ఓడిపోయినప్పటికీ వెంటనే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. (revanth reddy)