Revanth Reddy: ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కుట్ర‌?

Hyderabad: TPCC అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy).. న‌ల్ల‌గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని (uttam kumar reddy) చీట్ చేస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఉత్తమ్‌ ఇలాఖాలో కాంగ్రెస్ (congress) అభ్యర్థిగా వేరే వారి పేరుతో రేవంత్ రెడ్డి స‌ర్వేల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య, మాజీ ఎమ్మెల్యే పద్మావతి ప్రాతినిధ్యం వహించిన హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి (revanth reddy) స‌ర్వే చేయిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్, పద్మావతి పేర్లు బదులుగా వేరే వారి పేరు ఉండటంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్య‌క్తం చేసారు. ఈ విషయంపై తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రేకి ఫిర్యాదు చేసారు.

ఈ నేప‌థ్యంలో ఉత్త‌మ్ BRS పార్టీలో చేర‌తార‌ని తెలుస్తోంది. గత కొంతకాలంగా రేవంత్ రెడ్డి (revanth reddy) మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి (uttam kumar reddy) కోపంగా ఉన్నారు. తన మీద కాంగ్రెస్ (congress) పార్టీ వార్ రూంలో ట్రోల్ వీడియోస్ చేయిస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డిని విమ‌ర్శించారు. దీనికి తోడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరిక విషయంలో కోమటిరెడ్డి , ఉత్తమ్ కోపంగా ఉన్నారు. దాంతో కోమటిరెడ్డి ఇంటికి వెళ్ళిన రేవంత్ రెడ్డి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్దకు మాత్రం వెళ్ళలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే, మరో కాంగ్రెస్ సీనియర్ నేత కూడా చేరుతారనే వాద‌న‌లు వినిపిస్తున్నాయి.