Revanth Reddy: ఆ దమ్ము లేకపోతే KCR మాడా అని ఒప్పుకోవాలి
Hyderabad: KCR మగాడు అయితే గజ్వేల్ నుండి పోటీ చేయాలి లేదంటే మాడా అని ఒప్పుకోవాలంటూ మర్యాదలేని కామెంట్స్ చేసారు TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy). KCR గజ్వేల్ నుండి పోటీ చేస్తే BRS వేసే ఏ శిక్షకి అయినా నేను సిద్ధమని సవాలు చేసారు. 80 శాతం BRS సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోతారని వారిలో KCR కూడా ఉంటారని రేవంత్ (revanth reddy) తెలిపారు. ” KCRకు నా పేరు తీసే దమ్మలేదు. నా కళ్లల్లోకి చూసి మాట్లాడే దమ్ము లేదు. నేను ప్రెసిడెంట్ అయ్యి రెండేళ్లు అయ్యింది. ఒక్క రోజన్నా నా పేరు తీసాడా KCR. దమ్ముంటే రమ్మను. పుట్టలో దాక్కోవడం కాదు” అని సవాలు విసిరారు రేవంత్.