కాంగ్రెస్ నుంచి మ‌ళ్లీ BRSలోకి.. పొంగులేటికి రేవంత్ ఫోన్ కాల్

revanth reddy calls ponguleti amid congress leaders getting back to brs

Revanth Reddy: తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మెల్లిగా BRS ఎమ్మెల్యేలు ఒక్కొక్క‌రుగా కాంగ్రెస్‌లో చేరారు. ఇప్ప‌టికే ఆరుగురు BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుత‌దేమో అనుకుంటున్న నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి నిన్న గ‌ట్టి షాక్ త‌గిలింది బీఆర్ఎస్‌కి చెందిన గ‌ద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి నెల రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరి.. మ‌ళ్లీ నిన్న BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRని క‌లిసి పార్టీలోనే కొన‌సాగుతానని రిక్వెస్ట్ చేసారు.

బండ్ల‌తో పాటు మ‌రో ముగ్గురు ఎమ్మెల్యేలు తిరిగి BRS పార్టీలో చేరేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే వీరంతా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడుకుని కాంగ్రెస్ పార్టీలో చేరిన‌వారే. అలాంటిది ఇప్పుడు మ‌ళ్లీ వారు బీఆర్ఎస్‌లోకి వెళ్తున్న నేప‌థ్యంలో నిన్న రేవంత్ పొంగులేటికి ఫోన్ చేసి మాట్లాడిన‌ట్లు స‌మాచారం. నువ్వే క‌దా వారిని కాంగ్రెస్‌లో చేర్పించావు. మ‌ళ్లీ వారు ఎందుకు పార్టీని వీడి బీఆర్ఎస్‌లోకి వెళ్తున్నారు అని ప్ర‌శ్నించిన‌ట్లు స‌మాచారం.