Renuka Chowdary: బాబాయ్‌ని చంపినోడికి చంద్రబాబు ఓ లెక్కా?
సొంత బాబాయ్‌ని చంపినవాడికి చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ప్రాణం ఓ లెక్కా అని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత రుణుకా చౌదరి (renuka chowdary). చంద్రబాబు నాయుడుకి జైల్లో ఏమాత్రం భద్రత లేదని కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో ఇప్పటికీ అర్థంకావడంలేదని అన్నారు. వెంటనే ఈ కేసును సుమోటాగా తీసుకుని చంద్రబాబుకి భారీ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ పోలీసులు రక్షకులుగా కాకుండా భక్షకులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. జగన్‌కి మెంటల్ అని రాజ్యాంగంలో ఓ మార్పు తీసుకొచ్చి మానసికంగా రాజకీయల నేతలు ఫిట్‌గా ఉన్నారో లేదో ప్రతి ఐదేళ్లకు ఓసారి పరీక్షలు నిర్వహించాలని అన్నారు. జగన్ ఇలాగే ప్రవర్తిస్తే ఊరుకునేదే లేదని అన్నారు.