Renu Desai: ఆ ఒక్క మాట అనకుండా ఉండాల్సింది
Hyderabad: జనసేనాని పవన్ కళ్యాణ్‌కు (pawan kalyan) సపోర్ట్‌గా ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ (renu desai) చేసిన వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి ఇంట్లోని ఆడవాళ్లను, పిల్లలను లాగొద్దని రిక్వెస్ట్ చేసారు. అయితే వీడియో మొత్తంలో రేణూ పవన్‌కు సపోర్ట్ చేస్తూనే మాట్లాడటం వరకు బాగానే ఉంది కానీ కబాబ్ మే హడ్డీలాగా మధ్యలో ఒక మాట అన్నారు. ఆ ఒక్క మాట ఆవిడ అనకుండా ఉండి ఉంటే బాగుండేది.
“” మీకు తెలుసో లేదో.. నేను మొదటి రోజు నుంచి పవన్‌ను పొలిటికల్‌గా సపోర్ట్ చేస్తూనే వచ్చాను. ఇప్పటికీ చేస్తున్నాను కూడా. ఆయన నా విషయంలో చేసింది వంద శాతం తప్పే. నేను వ్యక్తిగతంగా ఎంతో బాధపడ్డాడు. కానీ ఇప్పుడు మూవ్ ఆన్ అయిపోయాను. అందుకే ఆయనకు పొలిటికల్‌గా ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. పవన్ డబ్బు మనిషి కాదు. ఎప్పుడూ సమాజం మంచి కోసమే ఆలోచిస్తుంటారు. మీరు కూడా దయచేసి వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి“” అన్నారు. (renu desai)
రేణూ మాట్లాడిన దాంట్లో ఆయన నా పట్ల చేసింది 100% తప్పే అని అనకుండా ఉండాల్సింది. రేణూ, పవన్ విడాకుల విషయంలో ఎవరిది తప్పు ఒప్పు అనేది ఇప్పటికీ బయటికి వారికి క్లారిటీ లేదు. కానీ రేణూ ఈ ఒక్క మాట చెప్పి పవన్‌దే తప్పు అని క్లారిటీ ఇచ్చేసినట్లు అయిపోయింది. (renu desai)