Adimoolam: అత్యాచార కేసులో TDP నేతకు ఊరట
Adimoolam: అత్యాచార కేసులో తెలుగు దేశం పార్టీ నుంచి సస్పెండ్ అయిన కోనేటి ఆదిమూలంకు ఊరట కలిగింది. బాధితురాలు తాను వేసిన కేసును విత్‌డ్రా చేసుకుంది. ఆమె చేస్తున్న ఆరోపణలన్నీ తప్పని వాదిస్తూ ఆదిమూలం ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసారు. రాజకీయ కక్షలతో తనపై పాల్పడుతున్న కుట్రలని పేర్కొంటూ కేసు కొట్టేయాలని కోర్టును కోరారు.
తను హార్ట్ పేషంట్ అని ఏంజియోప్లాస్టీ చేయించుకున్నానని మాటిమాటికీ కోర్టుల చుట్టూ తిరగలేనని అన్నారు. ఈ నేపథ్యంలో నిన్న బాధితురాలు ఆదిమూలంతో కోర్టు బయట సెటిల్‌మెంట్ చేసుకునేందుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని ఆదిమూలం తరఫు న్యాయవాది ఈరోజు కోర్టులో ఈ విషయాన్ని ప్రస్తావించగా.. కోర్టు కేసు కొట్టేసింది. కేసు విషయంలో అయితే ఆదిమూలంకు ఊరట లభించింది కానీ ఆయన లైంగిక చర్యకు పాల్పడుతున్న వీడియోలు మాత్రం బయటికి వచ్చాయి. పార్టీ నుంచి సస్పెండ్ అవ్వడంతో ఇక ఆయన్ను మళ్లీ తిరిగి తీసుకుంటారో లేదో తెలీదు.