Reddeppagari Madhavi: బొట్టు పెట్టి పిలవాలా? కడప ఎమ్మెల్యే కార్పొరేటర్ మధ్య మాటల యుద్ధం
Reddeppagari Madhavi: కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి రెడ్డికి.. స్థానిక కార్పొరేటర్ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. పెన్షన్ల పంపిణీ సమయంలో ఎమ్మెల్యే తానంతట తానే పంచేసారని.. తానొక కార్పొరేటర్‌ను ఉన్నానన్న విషయాన్ని మర్చిపోయి కనీసం సమాచారం ఇవ్వకపోవడం గౌరవం అనిపించుకోదని సదరు కార్పొరేటర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. దాంతో మాధవిరెడ్డికి ఒళ్లు మండింది. అందరి ముందు ఆ కార్పొరేటర్‌ను తిట్టేసారు. కడప నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో వారిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది.
“” పెన్షన్ల పంపిణీ సమయానికి నేను ఏ అధికారులకు చెప్పాలో వారికి చెప్పి పంపిణీ చేయించాను. దీనికి కార్పొరేటర్‌కు చెప్పాల్సిన అవసరం ఏముంది? కార్పొరేటర్ అంటే జిల్లాను సొంతం చేసుకున్నవాళ్లు కాదు కదా. ఇది మనం కొనుక్కున్న ప్రాంతం కాదు కదా. ప్రతీ చిన్న దానికి బొట్టు పెట్టి పిలుస్తారా?. ఇదేమీ మా ఇంట్లో పేరంటం కాదు మీ ఇంట్లో పేరంటం కాదు. మీరు పబ్లిక్ మీటింగ్‌లో ఇలాంటి అడగకండి. వీటికి ప్రొటోకాల్స్ ఉండవు. మీరు కార్యక్రమాల్లో పాల్గొనాలంటే మీరు స్వచ్ఛందంగా పాల్గొనండి. అంతేకానీ ఎవ్వరూ పిలవరు. “” అని ఆగ్రహం వ్యక్తం చేసారు.
దీనికి కార్పొరేటర్ లేచి మళ్లీ సమాధానం ఇచ్చారు. “” మేడం.. జిల్లాలో పోలియో చుక్కల పంపిణీకి కూడా కార్పొరేటర్‌కు సమాచారం ఇచ్చే చేస్తారు. మీరు మాత్రం అసలు మాకు ఏమీ చెప్పకుండా చేస్తున్నారు “” అని అన్నారు.