BRS: ఓట్ల శాతం తగ్గినట్లుంది..!
ఇటీవల BRS తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ఓ సర్వే చేపట్టింది. రిజల్ట్స్ చూస్తే.. BRSకు ఓటు శాతం కాస్త తగ్గిందనే చెప్పాలి. కొద్దిశాతమే కదా అని లైట్ తీసుకోడానికి లేదు. ఇలా అనుకునే.. కర్ణాటక ఎన్నికల్లో BJP ఘోరంగా ఓడిపోయి కాంగ్రెస్ (congress) అధికారంలోకి వచ్చింది. 2018లో TRS ఇలాగే సర్వే నిర్వహించింది. అప్పట్లో TRSకు ఓటు శాతం 47.4గా ఉంది. ఇప్పుడు చేపట్టిన సర్వేలో వచ్చిన ఫలితాలను చూస్తే 40 శాతం ఉంది. ఆ మిగతా 7.4 శాతం పడిపోయింది. BRS తర్వాత తెలంగాణలో ఆధిక్యం సొంతం చేసుకున్న పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్‌కు తెలంగాణలో ఓటు శాతం 27.6 శాతం ఉంది. ఆ తర్వా BJP 14.8 శాతంతో మూడో స్థానంలో ఉంది. (telangana elections)
ఈ సర్వేను ప్రతి నియోజకవర్గం నుంచి 1024 మంది ఓటర్ల చేత నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు మరో నాలుగు నెలలు మాత్రమే సమయం ఉందనగా 7.4 శాతం ఓట్లు తగ్గిపోయాయంటే BRS ఆలోచించాల్సిన విషయమే. అలాగని కాంగ్రెస్‌కు కూడా గెలిచేంత సీన్ లేదనే చెప్పాలి. ఎందుకంటే.. ప్రజలకు మంచి చేయడం సంగతి అటు ఉంచితే.. రైతులకు ఉచిత కరెంట్లు ఎందుకు? కాంగ్రెస్ నాయకుల వల్లే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందంటూ కొందరు కాంగ్రెస్ నేతలు చేసే పిచ్చి కామెంట్స్‌తో జనాలకు పిచ్చెక్కిపోతోంది. అదీకాకుండా తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత యుద్ధాలు జరుగుతున్నాయి. ఇక BJP గురించి చెప్పాలంటే.. ఆ పార్టీ నుంచి అంత సామర్ధ్యం ఉన్న నేతలు ఎవ్వరూ తెలంగాణలో లేరు. ఇవన్నీ చూసుకుంటే మళ్లీ KCR ప్రభుత్వమే హ్యాట్రిక్ కొట్టే ఛాన్సులు పుష్కలంగా కనిపిస్తున్నాయి. (telangana elections)