EXCLUSIVE: అందుకే తార‌క్ ఫ్లెక్సీల‌ను తొల‌గించ‌మ‌న్నారు

EXCLUSIVE: గుడివాడ‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (jr ntr) ఫ్లెక్సీల‌ను తొల‌గించాల‌ని నంద‌మూరి బాల‌కృష్ణ (nandamuri balakrishna) త‌న అనుచ‌రుల‌కు ఆదేశాలు ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నిన్న దివంగ‌త నేత నంద‌మూరి తార‌క రామారావు (NTR) వ‌ర్ధంతి వేడుక‌ల‌ను గుడివాడలోని ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద నిర్వ‌హించారు. తార‌క్‌తో పాటు కళ్యాణ్ రామ్ (kalyan ram) తాత‌గారి స‌మాధి వ‌ద్ద నివాళులు అర్పించారు. అయితే తార‌క్ వ‌స్తున్నాడ‌ని తెలిసి ఫ్యాన్స్ ఫ్లెక్సీల‌ను ఏర్పాటుచేసారు. అవి చూసిన బాల‌య్య త‌న అనుచ‌రుల‌ను పిలిపించి వెంట‌నే ఒక్క ఫ్లెక్సీ కూడా లేకుండా అన్నీ తీసేయాల‌ని ఆదేశించారు.

అయితే బాల‌య్య ఆ ఫ్లెక్సీలు తీయ‌మ‌న‌డానికి ఒక కార‌ణం ఉంద‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. తారక్‌కు రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఉద్దేశం లేద‌ని సినీ రంగంలోనే కొన‌సాగాల‌ని అనుకుంటున్నార‌ని అలాంట‌ప్పుడు రాజ‌కీయప‌రంగా ఆయ‌న ఫ్లెక్సీలు ఉంచ‌డం స‌బ‌బు కాద‌ని బాల‌య్య అభిప్రాయ‌ప‌డ్డార‌ట‌. అన‌వ‌స‌రంగా తార‌క్ ఫ్లెక్సీలు పెట్టి దానిని రాజ‌కీయ ల‌బ్దికోసం వాడుకోవ‌డం వంటివి చేసి తార‌క్ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారేమో అని భ్ర‌మ క‌లిగించడం ఎందుకు అన్న ఉద్దేశంతోనే బాల‌య్య ఫ్లెక్సీల‌ను తొల‌గించ‌మ‌న్నార‌ట‌.