Rashid Alvi: మోదీ చంద్రబాబు రాజీనామా చేయాల్సిందే
Rashid Alvi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు కాంగ్రెస్ నేత రషీద్ అల్వి. తిరుమల లడ్డూ చుట్టూ వివాదం నెలకొన్న నేపథ్యంలో అల్వీ స్పందించారు. తిరుమల లాంటి పుణ్యక్షేత్రంలో ఇంతటి దారుణం జరిగిందంటే.. అది కచ్చితంగా ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పే అని అన్నారు. వారి పాలన సరిగ్గా ఉండి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదని అన్నారు. దేవుడి ప్రసాదం కల్తీగా మారిందన్న బాధ మోదీకి ఏమాత్రం లేదని.. ఆయనకు ఎన్నికల ముందు ఏదో ఒక మతతత్వ వివాదం సృష్టించాలని చూస్తుంటారని అన్నారు. తిరుమలలో జరిగిన ఘోరానికి బాధ్యత వహిస్తూ చంద్రబాబు నాయుడు, మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు.