Ranil Wickremesinghe: మీరేనా ఇండియాను లీడ్ చేసేది?
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి.. (mamata banerjee) శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే (ranil wickremesinghe) నుంచి వింత ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు ఆమె నవ్వుకున్నారు. ఇంతకీ రణిల్ ఏమని అడిగారంటే.. ఇండియా కూటమిని లీడ్ చేస్తున్నది మీరేనా అని అడిగారు. దీనికి మమతా నవ్వుతూ.. అది ప్రజలపై ఆధారపడి ఉంటుంది. వారు సపోర్ట్ చేస్తే మేం లీడ్ చేస్తాం అని తెలిపారు. రణిల్‌ను మమత దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో కలిసారు. కాసేపు మాట్లాడుకున్నాక ఆయన్ను నవంబర్‌లో జరగనున్న స్టేట్ బిజినెస్ సమ్మిట్‌కు రావాలని ఆహ్వానించారు. మమతా 12 రోజుల పాటు దుబాయ్, స్పెయిన్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవగా.. అక్కడే రణిల్ ఉండటంతో మాట కలిపారు.