Ramchander Rao: బండిని బూతులు తిట్టి BJPలోకి ఎలా వ‌స్తాడు?

BRSలో ఉండి BJP నేత బండి సంజయ్‌ను (bandi sanjay) బూతులు తిట్టి.. ఇప్పుడు BJPలోకి మైనంప‌ల్లి (mynampally hanumanth rao) ఎలా వ‌ద్దామ‌ని అనుకుంటున్నాడు అని మండిప‌డ్డారు BJP నేత రామ్‌చంద‌ర్ రావు (ramchander rao). BRS పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు BJPలో చేరుతున్నారంటు వస్తున్న వార్తలపై రామ్‌చంద‌ర్ రావు స్పందించారు. గతంలో మైనంపల్లి తమ పార్టీ అగ్రనేతలను దూషించార‌ని, త‌మ‌ పార్టీ కార్యకర్తలను జైలుకు పంపాడ‌ని అలాంటి నేతలకు BJPలో చోటు ఉండదని అన్నారు.

త‌న కొడుక్కి BRS ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేద‌ని సొంత పార్టీ నేత అయిన హ‌రీష్ రావును (harish rao) నోటికొచ్చిన‌ట్లు తిట్టారు మైనంప‌ల్లి. దాంతో ఆయ‌న్ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించాల‌ని BRS నిర్ణ‌యించింది. దాంతో కాంగ్రెస్‌లోకి వెళ్లాలా.. లేక BJPలోకి వెళ్లాలా అనే సందిగ్ధంలో ఉన్నారు మైనంప‌ల్లి. (mynampally hanumanth rao)