Ram Gopal Varma: ఆ విష‌యంలో చిరంజీవి క‌రెక్ట్

ఎప్పుడూ మెగా కుటుంబం గురించి తీవ్ర స్థాయిలో విమ‌ర్శించే రామ్ గోపాల్ వ‌ర్మ (ram gopal varma) ఈరోజు మెగాస్టార్ చిరంజీవికి (chiranjeevi)స‌పోర్ట్‌గా నిలిచారు. ఇటీవ‌ల బ్రో సినిమాకు ఫండింగ్ ఎక్క‌డి నుంచి వ‌చ్చింది ఎంత రెమ్యున‌రేష‌న్ వ‌చ్చింది అంటూ ఏపీ మంత్రి అంబ‌టి రాంబాబు(ambati rambabu) కామెంట్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. బ్రో  (bro) సినిమాకు వ‌చ్చిన అక్ర‌మ ఫండింగ్ గురించి ఈడీకి కంప్లైంట్ చేయ‌డానికి ఆయ‌న ఢిల్లీకి కూడా వెళ్లారు. ఈ విష‌యంపై వ‌ర్మ స్పందిస్తూ.. సినిమా రెమ్యునరేషన్ అనేది నిర్మాతకి నటుడికి మధ్య జ‌రిగే చ‌ర్చ అని ఆ హీరో మార్కెట్‌ని బట్టి డబ్బులిస్తారని అన్నారు. ఆ విషయం ప్రభుత్వానికి కాని ఎవరికైనా అనవసరమ‌ని ఈ విషయంలో చిరంజీవి ఇజ్ రైట్ అని అన్నారు. (ram gopal varma)