Rajasthan Minister: చంద్రయాన్‌లోని ప్ర‌యాణికుల‌కు అభినంద‌న‌లు!

మీరు చ‌దివింది క‌రెక్టే. నిన్న ఇస్రో (isro) విజ‌య‌వంతంగా చేప‌ట్టిన చంద్ర‌యాన్ 3 (chandrayaan 3) మిష‌న్‌లో ప్రయాణికులు ఉన్నార‌ట‌. ఈ మాట‌ రాజ‌స్థాన్‌కు చెందిన కాంగ్రెస్ క్రీడా శాఖ మంత్రి అశోక్ చంద్న (rajasthan minister) అన్నారు. ఇస్రో స‌క్సెస్‌ఫుల్‌గా చేప‌ట్టిన చంద్ర‌యాన్-3 మిష‌న్ గురించి మీ అభిప్రాయం ఏంటి అని స్థానిక మీడియా వ‌ర్గాలు అడ‌గ్గా.. చంద్ర‌యాన్ -3 విజ‌య‌వంతంగా చంద్రుడిపై కాలు మోపింది. ఈ సంద‌ర్భంగా అందులో ఉన్న ప్ర‌యాణికుల‌కు అభినంద‌న‌లు చెప్పాల‌నుకుంటున్నా అని అన్నారు. చంద్ర‌యాన్ -3లో అస‌లు మ‌నుషులే లేర‌న్న విష‌యం పాపం ఆయ‌న‌కు తెలీదు. దాంతో ఒక రేంజ్‌లో ట్రోల్స్ చేస్తున్నారు.