Rajamundry jail: చంద్రబాబు అనారోగ్యంపై అవి ఫేక్ ఆరోపణలు
రాజమండ్రి సెంట్రల్ జైల్లో (rajamundry jail) జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న TDP అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ఆరోగ్యం బాలేదని.. ఆయన్ను జైలు అధికారులు పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యులు, TDP నేతలు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రర్ జైల్ అధికారులు ప్రెస్ మీట్ నిర్వహించారు. వారు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
చంద్రబాబు షుగర్ లెవెల్స్ సడెన్‌గా పడిపోయాయని అంటున్నారు నిజమేనా?
లేదు. అవన్నీ అబద్ధాలే. ఆయనకు మా వైద్యాధికారులు రోజుకు మూడుసార్లు పరీక్షలు చేస్తారు.
జైల్లో డ్రోన్ సంగతి ఏంటి?
ఆ డ్రోన్ ఎవరు ఆపరేట్ చేసారు అనే దానిపై విచారణ చేస్తున్నాం. జైలు లోపలికి అయితే డ్రోన్ రాలేదు. బయటి వరకు మాత్రమే వచ్చింది. అది మీడియా వారి పనే అని మా అనుమానం. (rajamundry jail)
ఎప్పటికప్పుడు చంద్రబాబు హెల్త్ అప్డేట్స్ ఎందుకు ఇవ్వడంలేదు?
మేం ప్రెస్ రిలీజ్‌లు ఇస్తున్నాం. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మరీ టూ మచ్‌గా ఫేక్ వార్తలు సృష్టిస్తున్నారు.
జైల్లోకి వచ్చాక చంద్రబాబు నాయుడుకి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి?
అవన్నీ మేం కుటుంబ సభ్యులతో మాత్రమే చర్చించగలం. బయటికి అలాంటివి చెప్పలేం.
చంద్రబాబు రక్షణ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
చంద్రబాబు నాయుడు జైల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయనపై సీసీటీవీ నిఘా ఉంచాం. ఎందుకంటే జైల్లో 2000 మందికి పైగా ఖైదీలు ఉన్నారు. వారిలో చంద్రబాబు ఒకరు. ఆయన ఉన్న సెల్‌లో కొంతమందిని తీసేసి వేరే చోటకు మార్చాం. చంద్రబాబుపై అనుక్షణం మా నిఘా ఉంది. (rajamundry jail)
చంద్రబాబు జైల్లోకి రాగానే సూపరింటెండెంట్ బదిలీ అయ్యారని వార్తలు వస్తున్నాయ్. వాటిపై మీ స్పందనేంటి?
ఏ పత్రికలు అలా రాస్తున్నాయో వెంటనే వారికి నోటీసులు ఇస్తున్నాం. వారు సరిచేసుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి అది అబద్ధం అని చెప్పడం కుదరదు.
దోమల బెడద ఉంది అంటున్నారు. దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
చంద్రబాబుకి దోమతెర ఇచ్చాం. ఫాగింగ్ కూడా చేస్తున్నాం. కూలర్లు, ఏసీలు పెట్టడానికి వీల్లేదు. ప్రత్యేక సందర్భాల్లో కోర్టు నుంచి ఆర్డర్స్ వస్తే మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అంతేకానీ మాకు మేమే ఎలాంటి సౌకర్యాలు కల్పించలేం.