Rajahmundry Jail: చంద్ర‌బాబును కూల్‌గా ఉండే ప్ర‌దేశంలోనే ఉంచాలి

TDP అధినేత చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) ఆరోగ్య ప‌రిస్థితిపై రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు (rajahmundry jail) డీఐజీ ర‌వి కిర‌ణ్, ఇత‌ర వైద్య బృందం స్పందించారు. ప్ర‌స్తుతానికి చంద్ర‌బాబు ఆరోగ్యంగా ఉన్నారని.. ఆయ‌న ఒంటిపై ఎర్ర‌టి ద‌ద్దుర్లు రావ‌డం నిజ‌మేన‌ని తెలిపారు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు నాయుడు ఆరోగ్యాన్ని బ‌ట్టి ఆయ‌న్ను చ‌ల్లని ప్ర‌దేశంలో ఉంచాల‌ని అధికారుల‌కు తెలిపిన‌ట్లు వైద్యులు పేర్కొన్నారు. అయితే ఆయ‌నకు కూల‌ర్, ఏసీ వంటివి ఏర్పాటుచేస్తారా అనే దానిపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు.