Rajagopal Reddy: “ఖ‌రీదైన” నిర్ణ‌యం..!

Telangana Elections: అంద‌రూ ఊహించిన‌ట్లుగానే BJP నేత కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి.. (rajagopal reddy)మ‌ళ్లీ సొంత‌గూడు కాంగ్రెస్‌లో (congress) చేరబోతున్నారు. ఒక‌ప్పుడు ఆయ‌న కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఆ త‌ర్వాత పార్టీ త‌న నిర్ణ‌యాల‌ను గౌర‌వించ‌డంలేద‌ని భావించి BJPలో చేరారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే తెలంగాణ ఎన్నిక‌ల్లో మునుగోడు (munugode) టికెట్ త‌న‌కు ఇవ్వ‌నందున రాజ‌గోపాల్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసారు. రేపో, ఎల్లుండో కాంగ్రెస్‌లో చేర‌బోతున్నారు. ఎందుకు స‌ర్ అని మీడియా వ‌ర్గాలు అడిగితే.. ప్ర‌స్తుతం తెలంగాణ ప్ర‌జ‌ల చూపు కాంగ్రెస్ వైపు ఉంద‌ని.. ప్ర‌జ‌లు ఎటుంటే తాను అటుంటానని చెప్పుకొచ్చారు.

త‌నకున్న ఏకైక ధ్యేయం తాను క‌ల‌లు క‌న్న తెలంగాణ‌ను చూడాల‌ని.. అందుకోసం BRS ప్ర‌భుత్వాన్ని అధికారం నుంచి దించాలి అని ఇప్ప‌టికే ప‌లుమార్లు వెల్ల‌డించారు. స‌రే.. ఇవ‌న్నీ ప‌క్క‌నపెడితే ఇప్ప‌టివ‌ర‌కు ఏ రాజ‌కీయ నేత కూడా తీసుకోని నిర్ణ‌యాన్ని రాజ‌గోపాల్ రెడ్డి తీసుకున్నారు. అదేంటంటే..ఆల్రెడీ ఒక పార్టీ నుంచి ఒక నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచి.. వేరే పార్టీలోకి జంప్ అయ్యి మ‌ళ్లీ అదే నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేయ‌డం. అదే మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో గెలిచింది. హాయిగా కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడు మునుగోడులో గెలిచిన అభ్య‌ర్ధిగా రాజ‌గోపాల్ రెడ్డి ఉన్నారు.

ఆ త‌ర్వాత పార్టీతో అంత‌ర్గత స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌టంతో BJPలోకి జంప్ అయ్యి మునుగోడు సీటుకు రాజీనామా చేసారు. దాంతో అక్క‌డ ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. అప్పుడు తానంత‌ట తానే BJP హైకమాండ్‌తో చ‌ర్చించి మ‌ళ్లీ మునుగోడులో పోటీ చేస్తాన‌ని తెలిపారు. కానీ 10వేల ఓట్ల‌తో ఆయ‌న ఓడిపోగా.. BRS నేత గెలిచారు. ఇంత‌కంటే అవ‌మానం ఉంటుందా? పైగా మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో పార్టీలు ఎంతో ఖ‌ర్చు పెట్టాయి. దేశ చ‌రిత్ర‌లోనే ఇప్ప‌టివ‌ర‌కు అవ్వ‌నంత ఖ‌ర్చు ఉప ఎన్నిక‌ల‌కు అయ్యింద‌ట‌. మునుగోడులో ఎన్నిక‌ల క‌మిష‌న్ దాదాపు రూ.8 కోట్లు, 5000 లీట‌ర్ల మ‌ద్యాన్ని స్వాధీనం చేసుకుంది.

అంతేకాదు.. మునుగోడు ఉప ఎన్నిక‌లు తెలుగు రాష్ట్రాల్లోనే మోస్ట్ వాచ్‌డ్ (అత్యంత ఎక్కువ మంది వీక్షించిన‌) ఎన్నిక‌గా పేరొందింది. పోలింగ్ ప్ర‌క్రియ స‌మయంలో దాదాపు 48 సీసీ కెమెరాలు, 298 పోలీస్ స్టేష‌న్ల‌లో పోలింగ్ ప్ర‌క్రియ ఎలా జ‌రుగుతోందో చూసేందుకు వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటుచేసారు. తీరా చూస్తే రాజ‌గోపాల్ రెడ్డి BRS అభ్య‌ర్ధి చేతిలో ఓడిపోయారు. దాంతో BJPకి రాజ‌గోపాల్‌పై న‌మ్మ‌కం పోయింది. ఉప ఎన్నిక‌ల త‌ర్వాత దాదాపు 6 నెల‌ల పాటు BJP హైక‌మాండ్ ఒక్క‌సారి కూడా రాజ‌గోపాల్ రెడ్డిని పిలిపించి మాట్లాడింది లేదు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న సొంత‌గూటికి చేరుకున్నారు. మ‌రి తాను ఆశించినట్లు ఎల్బీన‌గ‌ర్, మునుగోడు టికెట్లు కాంగ్రెస్ క‌ల్పిస్తుందో లేదో చూడాలి.