Rajagopal Reddy: BJPకి రాజీనామా

Telangana Elections: BJPకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో (congress) చేరుతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసారు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి (rajagopal reddy). KCR కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనేదే త‌న‌ ఆశయం అని మరో ఐదు వారాల్లో అది నెరవేరుతుందని భావిస్తున్నాను. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు స్పష్టమవుతోందని తెలిపారు. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికార BRS పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగిన BJP, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కొంత డీలా పడిందని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అధికార BRSకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ను భావిస్తున్నారని అందుకే తాను కూడా తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నానని రాజీనామా లేఖ‌లో పేర్కొన్నారు. (komatireddy rajagopal reddy)