Rajagopal Reddy: మళ్లీ BJPలోకి?
Telangana Elections: ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (rajagopal reddy) చర్చే ఎక్కువగా ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్‌లో (congress) ఉన్న ఆయన ఆ తర్వాత BJPలోకి వెళ్లారు. BJPలోకి వెళ్లాక మునుగోడు (munugode) ఉప ఎన్నికల్లో పట్టుబట్టి పోటీ చేసి మరీ ఓడిపోయారు. దాంతో భారతీయ జనతా పార్టీకి రాజగోపాల్ రెడ్డిపై నమ్మకం పోయింది. అందుకే ఆయనకు మునుగోడు టికెట్ ఇవ్వలేదు. దాంతో మళ్లీ కాంగ్రెస్ గూటికే వెళ్లిపోయారు. అక్కడికి వెళ్లాక ఆయన కోరుకున్నట్లే మునుగోడు టికెట్ దొరికింది.
ఇక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయన మునుగోడులో ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈరోజు ప్రచారంలో ఆయనకు సొంత పార్టీ కార్యకర్తల నుంచి నిరసన వ్యక్తం అయింది. మొన్నటి వరకు BJPలో ఉండి ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌కు ఎలా వచ్చారు అని నిలదీసారు. దాంతో రాజగోపాల్ రెడ్డి వారిపై చేయి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు మళ్లీ కొత్త చర్చ మొదలైంది. రాజగోపాల్ రెడ్డి తిరిగి మళ్లీ BJPలోకి వెళ్తారని టాక్. ఈ మాట ఎవరో కాదు BJP నేత మురళీధరరావు (muralidhar rao) వెల్లడించారు.
ఒకవేళ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే బండి సంజయ్ (bandi sanjay) సీఎం రేసులో ఉన్నారు కాబట్టి ఆయన్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారని.. కిషన్ రెడ్డికి (kishan reddy) ఆ ఆలోచన లేదు కాబట్టి ఆయన్ను అధ్యక్షుడిని చేసారని తెలిపారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నామని వెల్లడించారు.