Raja Singh: ఆ రౌడీలకు రేవంత్ రెడ్డి నెంబర్ ఇచ్చా
Raja Singh: తనకు కొందరి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అన్నారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్. ఈ విషయం గురించి పోలీసులకు చెప్పినా వారు పట్టించుకోలేదని అందుకే ఆ రౌడీ మూకలకు సీఎం రేవంత్ రెడ్డి నెంబర్ ఇచ్చానని అన్నారు.
“” నన్ను బెదిరిస్తున్నవారు ఎన్ని నెంబర్లు ఉన్నాయి అని అడిగారు. ఇంకో నంబర్ ఉందని చెప్పి సీఎం రేవంత్ నంబర్ ఇచ్చాను. ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పినా పోలీసులు పట్దించుకోవడంలేదు.. అప్పుడు రేవంత్ రెడ్డికి బెదిరింపు కాల్స్ వస్తే అయినా చర్యలు తీసుకుంటారని.. ముఖ్యమంత్రి నంబర్ ఇచ్చాను. ధర్మం కోసం నేను పనిచేస్తే నన్ను చంపేస్తామని నా ఫ్యామిలీని కూడా చంపేస్తామని బెదిరిస్తున్నారు “” అని ఆయన తెలిపారు.