Raja Singh: జానీ మాస్టర్‌ను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి
Raja Singh: అత్యాచార కేసులో అరెస్ట్ అయిన కొరియోగ్రాఫర్ జానీ పాషా మాస్టర్‌ను ఇండస్ట్రీ నుంచే బహిష్కరించాలని డిమాండ్ చేసారు భారతీయ జనతా పార్టీ నేత రాజా సింగ్. ఇలాంటి లవ్ జిహాదీకి పాల్పడే వారికి ఇండస్ట్రీలో చోటులేదని.. గతంలో కూడా ఇలాంటి ఎన్నో ఘటనలు టాలీవుడ్‌లో చోటుచేసుకున్నాయని అన్నారు. ఈ కొరియోగ్రాఫర్ ఎంత మందిని వేధించారో నిజానిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేసారు. ఇలాంటి కొందరి వల్ల మొత్తం టాలీవుడ్‌కే చెడ్డపేరు వస్తోంది. జానీ మాస్టర్ ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు కాబట్టి థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తూ ఇన్‌వెస్టిగేషన్ చేస్తే అన్ని నిజాలు బయటపడతాయని.. ఓ దొంగని హంతకుడిని పట్టుకున్నప్పుడు పోలీసులు ఎలా ఇంటరాగేషన్ చేస్తారో జానీకి కూడా అలాగే చేయాలని తాను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.