Rahul Sipligunj: నో పాలిటిక్స్.. ఓన్లీ మ్యూజిక్..!

బిగ్‌బాస్ మాజీ విన్న‌ర్ రాహుల్ సిప్లిగంజ్ (rahul sipligunj) పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వ‌నున్నాడ‌ని.. అసెంబ్లీ ఎన్నికల్లో గోషా మహల్  (gosha mahal) సీట్ నుండి కాంగ్రెస్ పార్టీ (congress) తరపున పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నట్లు వార్త‌లు వచ్చాయి. దీనిపై రాహుల్ క్లారిటీ ఇస్తూ.. అందులో ఎలాంటి వాస్త‌వం లేద‌ని.. త‌న‌ను పొలిటిక‌ల్ విష‌యాల్లోకి లాగొద్ద‌ని రిక్వెస్ట్ చేసాడు.

“” నేను ఒక ఆర్టిస్ట్‌ని. నేను ఇదే ఫీల్డ్‌లో ఉంటూ అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేయాలి. కానీ నేను పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తున్న‌ట్లు వార్త‌లు ఎలా వ‌చ్చాయో నాకు తెలీడం లేదు. నాకు అన్ని పార్టీల నేత‌ల ప‌ట్ల గౌర‌వం ఉంది. కానీ నేను మాత్రం రాజ‌కీయాల్లోకి రావ‌డం లేదు. నేను కేవ‌లం మ్యూజిక్ కెరీర్‌నే న‌మ్మ‌కున్నా. ఇదే రంగంలో ఉంటా. నేను ఏ పార్టీ నేత‌ను క‌ల‌వ‌లేదు.. అదే విధంగా ఏ పార్టీ కూడా టికెట్ ఇస్తామ‌ని న‌న్ను సంప్రదించ‌లేదు. ద‌య‌చేసి ఇది ఇక్క‌డితో వ‌దిలేయండి “” అని క్లారిటీ ఇచ్చాడు రాహుల్. (rahul sipligunj)