Rahul Gandhi: చైనా ఇండియాను లాక్కుంటోంది.. మోదీ మాట్లాడాలి
చైనా (china) ఇండియాను (india) ఆక్రమించుకోవాలని చూస్తోందని దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) స్పందించాల్సిందేనని అన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (rahul gandhi) . రెండు రోజుల క్రితం చైనా తమ దేశానికి సంబంధించిన మ్యాప్ రిలీజ్ చేసింది. అందులో అక్సాయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్ కూడా తమ భూభాగంలోనివే అని పేర్కొంది. అక్సాయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలోని ప్రదేశాలు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా చైనా తమ తీరు మార్చుకోవడంలేదు. దీని గురించి మోదీ మాట్లాడి తీరాల్సిందేనని రాహుల్ అన్నారు. (rahul gandhi)
అక్సాయ్ చిన్ ప్రాంతానికి చైనా 1962 యుద్ధ సమయంలో ఆక్రమించుకుంది. అప్పటినుంచి అరుణాచల్ ప్రదేశ్ ఇండియా భూభాగానికి చెందినది కాదని.. అది తమ దక్షిణ టిబెట్ ప్రాంతమని చెప్తూ వస్తోంది. దీని గురించి రాహుల్ మాట్లాడుతూ..“” నేను ఇన్నేళ్లుగా లఢక్‌లోని భూభాగాన్ని చైనా ఆక్రమించుకోవాలని చూస్తోంది అని చెప్తూనే ఉన్నాను. కానీ మోదీ మాత్రం లఢక్‌లో అంగుళం భూమిని కూడా చైనా లాక్కోలేదు అని చెప్తూ వచ్చారు. చైనా ఆక్రమణలకు పాల్పడుతోందని మొత్తం లఢక్‌కు తెలుసు. చైనా రిలీజ్ చేసిన మ్యాప్ చాలా సీరియస్ అంశం“” అని తెలిపారు.
దీనిపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (jai shankar) స్పందిస్తూ.. చైనాకు ఇలాంటి మ్యాప్‌లు రిలీజ్ చేయడం అలవాటేనని దాని గురించి అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. సెప్టెంబర్ 9 నుంచి 10 మధ్యలో జరిగే జీ20 సమ్మిట్ జరగనున్న నేపథ్యంలో చైనా ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. (Rahul gandhi)