Rahul Gandhi: రాత్రివేళ‌ ట్రక్కులో రాహుల్ ప్ర‌యాణం!

Haryana: కాంగ్రెస్(congress) నేత రాహుల్ గాంధీ(rahul gandhi) రాత్రివేళ‌లో ఓ ట్ర‌క్కులో ప్ర‌యాణించిన ఘ‌ట‌న చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నిన్న రాత్రి హ‌ర్యాణాలోని(haryana) అంబాలా ప్రాంతంలో రాహుల్ ఓ ట్రక్కులో ప్ర‌యాణిస్తూ క‌నిపించారు. గుర్తుప‌ట్టిన స్థానికులు వెంట‌నే ఫొటోలు, వీడియోలు తీసారు. ఆ స‌మ‌యంలో రాహుల్(rahul gandhi) ఎలాంటి త‌న‌వెంట ఒక బాడీగార్డుని తీసుకెళ్లారే త‌ప్ప సెక్యూరిటీ కాన్వాయ్ లేదు. రాత్రి పూట ట్ర‌క్కు డ్రైవ‌ర్లు ఎలా ప్ర‌యాణిస్తుంటారు? ఆ స‌మ‌యంలో వారు ప‌డే ఇబ్బందులు ఏంటి? అనే విషయాలు స్వ‌యంగా తెలుసుకునేందుకు ఇలా చేసాన‌ని రాహుల్ తెలిపారు.