Rahul Gandhi: తెలంగాణలో ప్రచారం.. ఆ పని చాలా డేంజర్
Rahul Gandhi: ఉన్న ఉద్యోగాల్లో అనువాదం చేసే జాబ్ చాలా డేంజర్ అని అన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కేరళలోని కోళికోడ్‌లో ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించగా.. రాహుల్ ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో రాహుల్ గాంధీకి ట్రాన్స్‌లేటర్‌గా IUML ఎంపీ అబ్దుసమద్ సమాదని వ్యవహరించారు. రాహుల్ చెప్పే వ్యాఖ్యలను సమాదని అనువదించారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి తెలంగాణలో ఎదురైన ఓ సంఘటనను అక్కడి ప్రజలతో పంచుకున్నారు. ట్రాన్స్‌లేటర్ ఉద్యోగం అనేది చాలా డేంజరస్ అని తెలంగాణ ఎన్నికల్లో భాగంగా ప్రచారానికి వెళ్తే తన మాటలను అనువదిస్తున్న వ్యక్తి తప్పుగా చెప్పాడని.. తనకు అనుమానం వచ్చి ఏది పడితే అది మాట్లాడినా కూడా దానిని అనువాదించడం చూసి షాకయ్యానని పేర్కొన్నారు. ఆ సమయంలో తనకు చాలా కోపం వచ్చినప్పటికీ ఏమీ అనలేని పరిస్థితిలో ఉన్నానని వెల్లడించారు.