Rahul Gandhi: సీట్ల సర్దుబాటు ఎందుకు చేయలేదు.. ఇప్పుడు BJP ఎగరేసుకుపోయింది
Rahul Gandhi: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (congress) కేవలం తెలంగాణలో మాత్రమే అధికారాన్ని చేజిక్కించుకుంది. మిజోరాం మినహా మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, రాజస్థాన్లో కమలం విరగబూసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్టీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాన్ని ఏర్పాటుచేసారు. సమావేశంలో పాల్గొన్న కీలక నేతలపై సున్నితంగా మండిపడ్డారు.
మధ్యప్రదేశ్లో నాలుగు సార్లు గెలుస్తూ వచ్చిన కాంగ్రెస్ ఈ సారి BJP చేతిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలతో ఎందుకు సీట్ల సర్దుబాట్లు చేయలేదు.. ఇప్పుడు చూడండి BJP ఎగరేసుకుపోయింది అని రాహుల్ అసహనం వ్యక్తం చేసారు. 2024లో లోక్ సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ తీవ్రంగా కృషిచేస్తోంది. కనీసం ఇప్పుడైనా ఇండియా (india bloc) కూటమి కలిసి లోక్ సభ ఎన్నికల్లో (lok sabha elections) సత్తా చూపించాలని.. మనలో మనం కొట్టుకుంటో BJP సీట్లు ఎగరేసుకుపోతుందని రాహుల్ అభిప్రాయపడ్డారు.