Rahul Gandhi: వచ్చే ఎన్నికల్లో BJPకి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం
రానున్న ఎన్నికల్లో (lok sabha elections) BJP సర్ప్రైజ్ ఇవ్వబోతున్నామని అన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (rahul gandhi). తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్లలో 2024లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తధ్యమని.. తమ గెలుపుతో BJPకి సర్ప్రైజ్ ఇస్తామని తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో తమ పార్టీకి గెలవడానికి గల అంశాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో కూడా అదే ఫార్ములా పాటిస్తామని తెలిపారు.
“” తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్లో మా విజయం ఖాయం. రాజస్థాన్లో కూడా గెలుపుకి దగ్గర్లోనే ఉన్నాం. BJP కూడా అంతర్గతంగా ఇదే అనుకుంటోంది. కర్ణాటక ఎన్నికల్లో మేం గెలవడానికి కారణం BJP ఇక ప్రచారం చేసుకోడానికి ఏమీ మిగల్లేదు. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయ్ కాబట్టి BJP ఎంపీలు రమేష్ బిదూరీ, నిశికాంత్ దూబేలతో పార్లమెంట్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయిస్తున్నారు. దీని వల్ల మీడియా, ప్రజల దృష్టి పక్కకు మళ్లుతుంది అనేది BJP ప్లాన్. ఆ ప్లాన్ మాకు అర్థమైపోయింది. అందుకే వాళ్ల ట్రాప్లో మేం పడకుండా జాగ్రత్తపడుతున్నాం. మేం పార్లమెంట్లో ఏ విషయం గురించైనా ప్రస్తావనకు తెస్తే దాని గురించి వారు మాట్లాడకుండా ఇతర ఎంపీలతో తిట్టించి టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. BJP మీడియాను కూడా అదుపులో పెట్టుకుంది. రాజస్థాన్లో ఇప్పటికీ ప్రజలకు మాకే సపోర్ట్ చేస్తోంది అంటే అందుకు కారణం మేం తీసుకొచ్చిన పథకాలే.
జమిలి ఎన్నికల విషయాన్ని కూడా ప్రజల దృష్టి అసలైన సమస్యల నుంచి మళ్లించడానికే తీసుకొచ్చారు. ప్రస్తుతానికి దేశంలో డబ్బు సమస్య ఎక్కువగా ఉంది. వెనకబడిన కులాలు ఇంకా నలిగిపోతున్నారు. యువత ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. కానీ BJP మాత్రం వీటి గురించి మాట్లాడదు. ప్రతిపక్ష పార్టీలు ఆర్థిక ఇబ్బందులతో పాటు మీడియా ఎటాక్స్కి వల్ల కూడా ఇబ్బందిపడుతున్నాయి. ఇప్పుడు మీరు ఒక వ్యాపారవేత్త దగ్గరికి వెళ్లి ఫలానా ప్రతిపక్ష పార్టీకి ఫండ్స్ ఇస్తారా అని అడగండి. వారు ఇవ్వలేరు. ఒకవేళ ఇచ్చినా వారి పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే“” అని రాహుల్ పేర్కొన్నారు. (rahul gandhi)