Rahul Gandhi: మా స‌త్తా చూసారుగా.. తెలంగాణ‌లో వ‌చ్చేది మేమే..!

Bihar: బిహార్‌లో జ‌రుగుతున్న ప్ర‌తిప‌క్షాల స‌మావేశంలో కాంగ్రెస్ (congress) నేత రాహుల్ గాంధీ (rahul gandhi) మాట్లాడారు. ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కులైన బిహార్ ముఖ్య‌మంత్రి నితీష్‌కుమార్‌ను ప‌ల‌క‌రించిన అనంత‌రం రాహుల్ మాట్లాడారు. “మీ మూడ్ ఎలా ఉంది? క‌ర్ణాట‌క‌లో ఏం జరిగిందో చూసారుగా? ఇక మ‌ధ్య‌ప్ర‌దేశ్, రాజ‌స్థాన్, తెలంగాణ‌లోనూ ఈసారి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేది మేమే. బీజేపీ క‌ర్ణాట‌క‌లో ప‌ర్య‌ట‌న‌లు చేసింది, ప్ర‌సంగాలు చేసింది, సీట్ల‌నీ ఊడ్చేస్తాం అనింది. కానీ ఏమైందో చూసారుగా. ఇప్పుడు చెప్తున్నా.. క‌ర్ణాట‌క‌లో బీజేపీ ప‌ని అయిపోయింది. ఇప్పుడు రాజ‌స్థాన్, తెలంగాణ‌, మధ్య‌ప్ర‌దేశ్లోనూ బీజేపీని తుడిచిపెట్టేస్తాం. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే పేద‌ల కోసం ప‌నిచేస్తోంది” అని ధీమా వ్య‌క్తం చేసారు రాహుల్.