Rahul Gandhi: అందుకు 100% చింతిస్తున్నా
కాంగ్రెస్ (congress) అధికారంలో ఉన్నప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లులో (women’s reservation bill) OBCలకు అవకాశం ఇవ్వనందుకు ఇప్పుడు 100% చింతిస్తున్నానని అన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (rahul gandhi). ఇప్పుడు పార్లమెంట్‌లోని ఇరు సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాహుల్ గాంధీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నాడు తాము చేయలేనిది ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం చేయాలని ఈ బిల్లులో OBCలకు అవకాశం ఇవ్వాలని తెలిపారు. నాడు OBC వర్గాలకు అవకాశం ఇవ్వాలని బిల్లులో ఆమోదించి ఉంటే ఈపాటికి ఈ బిల్లు అమల్లోకి వచ్చి పదేళ్లు అయ్యేదని అన్నారు.