CWC Meeting: ఏమిటి.. ఎందుకు.. ఎలా?
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం (cwc meeting) నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ (rahul gandhi), సోనియా గాంధీలు (sonia gandhi), ప్రియాంక గాంధీలు (priyanka gandhi) ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వారికి భారీ బందోబస్త్తో కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు.
ఈ సమావేశం అజెండా ఏంటి?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (telangana elections) సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తొలి సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించనుంది. ఇదే సమావేశంలో మిగతా ఐదు రాష్ట్రాల్లో ఎలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలో చర్చిస్తారు. అధికార BRS ప్రభుత్వాన్ని తరిమికొట్టేలా ఈ సమావేశం ఉండనుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. సాధారణంగా సమావేశాలు ఎప్పుడూ కూడా దేశ రాజధాని ఢిల్లీలో జరిగేవి. కానీ మొదటిసారి హైదరాబాద్లో జరగనున్నట్లు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్ తెలిపారు.
రెండు రోజుల పాటు ఈ CWC సమావేశం జరగనుంది. రేపు తెలంగాణ జాతీయ సమైఖ్యత దినోత్సవం కూడా నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో మెగా ర్యాలీ నిర్వహించి తెలంగాణ ప్రజలకు 6 హామీలను ప్రకటించనున్నారు. ఈ CWC సమావేశంలో 39 రెగ్యులర్ సభ్యులు, 32 శాశ్వత ఆహ్వానితులు, 13 ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొననున్నారు. (cwc meeting)