Jagtial: మీకు ఏ అవ‌స‌ర‌మున్నా నేను సైనికుడిగా నిల‌బ‌డ‌తా

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (rahul gandhi) క‌రీంన‌గ‌ర్‌లోని జ‌గిత్యాల‌లో (jagtial)  పర్య‌టించారు. తెలంగాణ ఎన్నిక‌లు (telangana elections) ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ విజ‌య‌భేరి స‌భ‌ను చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ఒకే కుటుంబం కూర్చుని తెలంగాణ‌ను క‌బ్జా చేసేందుకు త‌న త‌ల్లి సోనియా గాంధీ తెలంగాణ‌ను ఇవ్వ‌లేద‌ని.. ప్ర‌జ‌ల కోసం ఇచ్చార‌ని అన్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఏ అవ‌స‌రం ఉన్నా తాను ఒక సైనికుడిగా నిల‌బ‌డ‌తాన‌ని హామీ ఇచ్చారు. జ‌గిత్యాల‌తో 40 ఏళ్ల‌కు పైగా రాజ‌కీయ అనుబంధం ఉన్న జీవ‌న్ రెడ్డిని (jeevan reddy) గెలిపించాల‌ని కోరారు.