Raghurama Krishna: చంద్ర‌బాబు సాయంత్రం క‌ల్లా రిలీజ్ అవుతారు

అరెస్ట్ అయిన చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) సాయంత్రం క‌ల్లా రిలీజ్ అవుతార‌ని అన్నారు YCP అస‌మ్మ‌తి నేత ర‌ఘురామ కృష్ణం రాజు (raghurama krishna). చంద్ర‌బాబు అరెస్ట్‌పై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. త‌న‌ని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన‌ప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్ (ap cm jagan) త‌న‌ను చావ‌బాదించాడ‌ని..అస‌లు కొట్టి చంపేయ‌మ‌న్నాడ‌ని ఆనాటి రోజులను గుర్తుచేసారు. ఇప్పుడు చంద్ర‌బాబు నాయుడిని కాపాడుకునే బాధ్య‌త త‌మ అంద‌రి మీద ఉంద‌ని.. ఆయ‌న్ను కాపాడుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాల‌ని అన్నారు. జ‌వాన్ సినిమాలో డ‌బ్బు తీసుకుని ఓట్లు వేయొద్ద‌ని జ‌గ‌న్ గురించే చెప్పార‌ని.. సినిమాలో చూపించిన‌ట్లు మ‌నం వాళ్ల‌ని వేసేయ‌డానికి వీలు ప‌డ‌దు కాబ‌ట్టి ఓటు ప‌వ‌ర్‌తో ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కి బుద్ధి చెప్పాల‌ని అన్నారు. జ‌గ‌న్ విసిరేసిన ఎంగిలి ముద్ద‌ల‌కు ఆశ‌ప‌డి ప్ర‌జ‌లు ఎవ్వ‌రూ ఆయ‌న‌కు ఓటు వేయొద్ద‌ని రిక్వెస్ట్ చేసారు. (raghurama krishnam raju)