BRS లోకి రఘునందన్?
Hyderabad: BJP తెలంగాణ అధ్యక్ష పదవి కోసం చాలా మంది ఎంతో ఆశగా ఎదురుచూసారు. మొన్నటివరకు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆ పదవిలో ఉన్నారు. ఇప్పుడు ఆయన స్థానంలో BJP మంత్రి కిషన్ రెడ్డిని నియమించింది. అయితే ఈ పదవి కోసం ఎంతో ఎదురుచూసారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు (raghunandan rao). పార్టీ కోసం చాలా కష్టపడ్డానని పదవి తనకు ఇస్తారని ఆశించినప్పటికీ నిరాశే ఎదురైందని అన్నారు. కిషన్ రెడ్డిలో ఉన్నదేంటి తనలో లేనిదేంటి అని ప్రశ్నించారు. BJP నిర్ణయం పట్ల సంతృప్తికరంగా లేని రఘునందన్ త్వరలో BRS పార్టీలో చేరే అవకాశం ఉందని వాదనలు వినిపిస్తున్నాయి. తనకు విలువ లేని చోట ఉండలేనని, తనని, ఈటెల రాజేందర్ కటౌట్లను చూసే ఓట్లు పడతాయంటూ రఘునందన్ మాట్లాడిన ఆడియో క్లిప్ లీక్ అవడం వైరల్ అవుతోంది.