Raghunandan Rao: అధ్యక్ష పదవి నాకెందుకు ఇవ్వరు?
Hyderabad: నేనెందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కాను అని BJPని ప్రశ్నిస్తున్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు (raghunandan rao). BJP రాష్ట్ర అధ్యక్ష పదవి తనకు ఇవ్వాలని, చేసిన పనికి కూలీ అడుగుతున్నానని దిల్లీలో హైకమాండ్‌ని కలిసి మాట్లాడాలని అనుకుంటున్నట్లు రఘనందన్ తెలిపారు. అధిష్టానం అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నానని తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్ లేదంటే జాతీయ అధికార ప్రతినిధి పదవులు ఆశిస్తున్నట్లు తెలిపారు. పదేళ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్నానని కొన్ని విషయాల్లో తన కులమే తనకు శాపంగా మారుతోందని అన్నారు. రెండో సారి దుబ్బాక (dubbaka) నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమాగా చెప్తున్నారు.
ప్రస్తుతం BJP రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (bandi sanjay) పుస్తెలు అమ్మి పోటీ చేసాడని అలాంటి వ్యక్తికి యాడ్స్ ఇవ్వడానికి రూ.100 కోట్లు ఎక్కడివని రఘునందన్ ప్రశ్నించారు. శాసన సభాపక్ష నేత లేడనే విషయం కేంద్రమంత్రి జేపీ నడ్డాకు (jp nadda) తెలియదని తన సేవకు ప్రతిఫలం దక్కకపోతే నడ్డాపై ప్రధాని నరేంద్ర మోదీకి (narendra modi) ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో BJP గుర్తు చూసి ఎవరూ ఓటు వేయరని ఈటల రాజేందర్, రఘునందన్ బొమ్మలుంటేనే BJPకి ఓట్లు పడతాయని షాకింగ్ కామెంట్స్ చేసారు.