Raghunandan Rao కిష‌న్ రెడ్డిని అంత మాట‌న్నారా?

Hyderabad: BJP తెలంగాణ అధ్య‌క్ష ప‌ద‌వి త‌న‌కు ఇవ్వ‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు దుబ్బాక BJP ఎమ్మెల్యే ర‌ఘ‌నంద‌న్‌రావు (raghunandan rao). ఆయ‌న ఆఫ్ రికార్డ్ మాట్లాడిన ఆడియో ఒక‌టి లీకైంది. ఆ ఆడియోలో BJP తెలంగాణ అధ్య‌క్షుడిగా ఎంపికైన మంత్రి కిష‌న్ రెడ్డిని (kishan reddy) నోటికొచ్చిన‌ట్లు తిట్టిన‌ట్లుగా ఉంది.

“కిషన్ రెడ్డికి ఏం అర్హత ఉంది? నాకు ఏం అర్హత లేదు? ప్రెసిడెంట్ రేసులో నేను ఎందుకు ఉండొద్దు? నేను వెలమ వాడిని కాబట్టి కేసీఆర్‌కు అనుకూలంగా ఉంటానని దుష్ప్రచారం చేస్తున్నారు. నాకు కులమే మైనస్. కొన్ని సమస్యల్ని కాలమే పరిష్కరిస్తుంది. నేను పిల్లను చూడటానికి వచ్చా.. ఈమె నచ్చకపోతే పక్కింటికి పోతా. అడుక్కు తినేవాడికి ఊర్లు కరువా? నీ ఇంటికాడ ఏయకపోతే పక్కింటికిపోతా. ఈ ఊరిలో ఎవ్వరూ బిచ్చం వేయలేదనుకోండి నడుచుకుంటా పక్క ఊరికి కూడా పోతాడు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి కాదు. ఒక వర్గం మీడియా కావాలని అలా ప్రచారం చేస్తోంది. BJP, BRS ఒకటైతే కాంగ్రెస్‌తో ప్రతిపక్ష కూటమిలో ఉన్న అఖిలేష్ యాదవ్ KCRని ఎందుకు కలుస్తున్నాడు? నేను ఉన్న పార్టీలోనే ఉంటా. దుబ్బాక నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి వస్తా. BJP బీఫామ్ ఇస్తే గెలిచానా? BJP గుర్తు ఉంది కాబట్టి గెలిచానా? నిన్నటిదాకా నేను మాట్లాడలేదు. ఇయ్యాల మాట్లాడుతున్నా.

మొగోడు అనుకుంటే ప్రజలు నాకు ఓటేశారు. నేను అమ్ముడపోతా అనుకుంటే నాకు ఓటెందుకు వేస్తారు? నేను అమ్ముడుపోయేవాడినే అయితే ప్ర‌జ‌లు నాకు ఓటెయ్య‌రు క‌దా.. BRSకే వేస్తారు కదా. నేను అమ్ముడుపోయేటోడ్ని అయితే రెండున్నర ఏండ్ల కిందే అమ్ముడుపోవాలి. ఇప్పుడు ఎందుకు అమ్ముడుపోతా. నాకంటే ముందు కూడా పార్టీ పోటీ చేసింది, గుర్తు పోటీ చేసింది. 3500 ఓట్లే వచ్చాయి. పార్టీ, గుర్తు అనేవి లాస్ట్ అంశాలు. నన్ను వంకరగా అడిగితే వంకరగానే మాట్లాడతా” అంటూ సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది.