“వైజాగ్‌లోనే జ‌గ‌న్, కేఏ పాల్ ప్ర‌మాణ స్వీకారం”

Raghu Rama Krishna Raju satire on ka paul and ys jagan mohan reddy

Raghu Rama Krishna Raju: సెటైర్లు, పంచ్‌ల‌కు పెట్టింది పేరు ర‌ఘురామ కృష్ణంరాజు. ఈసారి ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీ త‌ర‌ఫున ఉండి నుంచి పోటీ చేసారు. ఎప్ప‌టిక‌ప్పుడు తెలుగు దేశం పార్టీ గురించి కానీ కూట‌మికి వ్య‌తిరేకంగా కానీ ఎవ‌రైనా వ్యాఖ్య‌లు చేస్తున్నా కుట్ర‌లు ప‌న్నుతున్నా ప్రెస్ మీట్లు పెట్టి క్లారిటీ ఇవ్వ‌డం ఆయ‌న‌కు అల‌వాటు.

ఈ నేప‌థ్యంలో.. ఓ ప‌క్క వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు త‌మ నాయకుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైజాగ్‌లో జూన్ 9న ఉద‌యం 9:30 గంట‌ల‌కు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టిస్తున్నారు. మ‌రోప‌క్క అదే వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేసిన కేఏ పాల్ కూడా తాను ఎంపీగా గెలిచేసాన‌ని.. త‌న పార్టీకి 175 సీట్లు వ‌చ్చినా వ‌స్తాయ‌ని అంటున్నారు. దాంతో ర‌ఘురామ వీరిపై సెటైర్ వేసారు. క‌చ్చితంగా వైజాగ్‌లో 9న కేఏ పాల్, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేస్తార‌ని అంద‌రూ ఆ వేడుక‌ను క‌ళ్లారా చూసేందుకు సిద్ధంగా ఉండాల‌ని చ‌మ‌త్క‌రించారు.