Raghav Chadha: నేను గ‌నుక బ‌ర్త్‌డే పార్టీ ఇస్తే….

Delhi: ఆమ్ ఆద్మీ పార్టీ (aap) నేత రాఘ‌వ్ చ‌ద్దా (raghav chadha) త‌న‌పై BJP పార్టీ నేత‌లు చేసిన ఫోర్జ‌రీ ఆరోప‌ణ‌ల‌పై స్పందించారు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుని (delhi ordinance bill) వ్య‌తిరేకించేందుకు రాఘ‌వ్ వివిధ పార్టీల‌కు చెందిన‌ ఐదుగురు రాజ్య‌స‌భ ఎంపీల సంత‌కాల‌ను ఫోర్జరీ చేసార‌ని BJP ఆరోప‌ణ‌లు చేసింది. దీనిపై రాఘ‌వ్ చ‌ద్దా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. (forgery case)

“” నా వ‌య‌సు 34 ఏళ్లు. నాకంటే పెద్ద వారికి వ్య‌తిరేకంగా మాట్లాడుతున్నాన‌ని BJP త‌ట్టుకోలేక‌పోతోంది. అందుకే నాపై ఈ ఆరోప‌ణ‌లు చేస్తోంది. అదే నిజ‌మైతే రుజువు చూపించండి. ఒక అబ‌ద్ధాన్ని వెయ్యి సార్లు చెప్తే అది నిజమైపోతుంది అనేది BJP పాల‌సీ. అంద‌రూ దానినే ఫాలో అవ్వాలి అనుకుంటోంది. అస‌లు బిల్లుల విష‌యంలో రాజ్య‌స‌భ ఎంపీల సంత‌కాల‌తో అవ‌స‌రం కూడా లేదు. అలాంట‌ప్పుడు ఫోర్జ‌రీల‌కు పాల్ప‌డాల్సిన అవ‌స‌రం నాకేముంది? ఉదాహ‌ర‌ణ‌కు.. ఇప్పుడు నేను గ‌నుక బ‌ర్త్‌డే పార్టీ ఇవ్వాల‌నుకున్న‌ప్పుడు ఒక ప‌ది మందిని పిలిచాను అనుకోండి. అందులో ఎనిమిది మంది వ‌స్తారు. మిగ‌తా ఇద్ద‌రు రాక‌పోగా పైగా నేను పిల‌వలేదు అని నాపై నింద‌లు వేస్తారు. BJP చేస్తున్న ఆరోప‌ణ‌లు కూడా అలాగే ఉన్నాయి“” అని వెల్లడించారు రాఘ‌వ్. (raghav chadha)